నోయల్ ని చావమన్న గంగవ్వ..!

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 16, 2020, 09:02 PM

ఈ సారి బిగ్ హౌస్ లో యూత్ అలజడి మామూలుగా లేదు. ఒకరిని మించి ఒకరు ఉర్రూతలు ఊగిస్తున్నారు. బిగ్ బాస్ కూడా అందరిని ఎలా నడిపించాలో అలా నడిపిస్తూ.. ఎవరి మధ్య చిచ్చులు పెట్టాలో పెడుతూ.. ఎవరి మధ్య రిలేషన్ పెంచాలో పెంచుతూ.. పోతున్నాడు. దీనిలో భాగంగానే హారిక హౌస్ మేట్స్ అందరిని ఎట్రాక్ట్ చేసేలా ఏదైనా చేయాలని ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన హారిక హాట్ హాట్ డ్యాన్స్ తో అందరికి పిచ్చెక్కించింది. ఆ తర్వాత నోయల్, గంగవ్వతో కలిసి ఓ చిన్న స్కిట్ చేసింది. ఇందులో హారిక అమ్మమ్మగా గంగవ్వ చేస్తే.. బాయ్ ఫ్రెండ్ గా నోయల్ చేశాడు. దాంట్లో భాగంగానే .. హారిక నోయల్ ని తీసుకొచ్చి అమ్మమ్మ ఇతన్ని లవ్ చేస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అని అడుగుతాది. నోయల్ కూడా అమ్మమ్మైన గంగవ్వను ప్లీజ్ అవ్వ పెళ్లికి ఒప్పుకో అని బతిమాలతాడు.. పెళ్లి చేయకుంటే సచ్చిపోతా అంటాడు... దీంతో గంగవ్వ నోయల్ ని చస్తే చావు అంటాది. అలా ముగ్గురు కలిసి తమ తమ యాక్టింగ్ తో అదరగొట్టారు. హౌస్ మేట్స్ వారితో పాటు ప్రేక్షకులంతా కూడా పడిపడి నవ్వుకున్నారు.


 
Recent Post