తండ్రి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన ఎస్పీ చరణ్

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 16, 2020, 09:03 PM

ఎస్పీబీ ఆరోగ్యం చాలా త్వరగా కోలుకుంటోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతూనే ఉంది. రోజురోజుకీ ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఇదే విషయం ఎస్పీ చరణ్ చెప్పాడు. తాజాగా ఈయన తన తండ్రి ఆరోగ్యం గురించి ట్వీట్ చేసాడు. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్‌డేట్‌ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పటికీ ఎక్మోతో పాటు వెంటిలేటర్‌ కూడా కొనసాగుతుంది. అయినా కూడా ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడటంపై వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటూ చెప్పాడు చరణ్.
Recent Post