డాన్స్‌లతో బిగ్ బాస్ హౌస్‌ని షేక్ చేసిన కంటెస్టెంట్లు

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 17, 2020, 10:37 AM

బిగ్ బాస్ హౌస్‌లో బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. మొనాల్ గజ్జర్‌కు ఎప్పుడూ అఖిల్, అభిజిత్‌లు బాడీగార్డ్‌లుగా ఉంటూ.. ఎవరికి వీలైంతగా వాళ్లు పులిహోర కలపడంలో బిజీగా మారడంతో.. నీతో మాట్లాడటం మాకు కష్టంగా ఉందని మొనాల్‌తో గుసగుసలాడారు లాస్య, సుజాతలు.


మేం నీతో మాట్లాడాలని వచ్చినా.. నీ పక్కన వాళ్లు ఉంటూనే ఉంటున్నారు.. ఇక నీతో మాట్లాడటమే అవ్వడం లేదు.. నీతో కంఫర్టబుల్‌గా ఉండలేకపోతున్నాం అంటూ మొనాల్‌తో చెప్పుకొచ్చారు లాస్య, సుజాతలు. నువ్ ఏ రూట్‌లో వెళ్లాలని అనుకుంటున్నావో క్లారిటీ తీసుకో.. అడ్డదిడ్డంగా పోతే ప్రమాదం ఉంటుందని మొనాల్‌ని నవ్వుతూనే హెచ్చరించారు వీరిద్దరు. అఖిల్‌కాని.. ఇటు అభిజిత్‌ని కూడా ఏ మాత్రం దూరం చేసుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ వాళ్లకు తనవంతు ప్రోత్సాహం ఇస్తున్న మొనాల్ తనకు తెలుగు రాకపోవడంతో వాళ్లు హెల్ప్ చేస్తున్నారంటూ ఇంగ్లీష్‌లోనే చెప్పింది.


ఇక ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ సాంగ్‌కి రెచ్చిపోయి డాన్స్‌లు చేశారు కంటెస్టెంట్లు. పొట్టి పొట్టి బట్టలతో దేత్తడి హారిక, అరియానాలు మరోసారి అందాల ప్రదర్శన చేశారు. ఇక అభిజిత్ మొనాల్‌తో బయట పులిహోర కలుపుతుండగా.. మొనాల్ కోసం దోసెలు వేయించి తీసుకుని వెళ్లాడు అఖిల్. ఇక మొనాల్‌కి పొరమారడంతో అభిజిత్ వాటర్ కోసం లేచి వెళ్లగా.. అఖిల్ తినడం ఆపేసి మరీ అభిజిత్ కంటే ముందు వెళ్లి వాటర్ అందించాడు.


ఇక అఖిల్ వాటర్ పట్టుకుని వెళ్తుండటం చూసి.. నువ్ ఇస్తున్నావా? అంటూ సెటైర్ వేశాడు. ఆ తరువాత మొనాల్‌తో ముచ్చట్లను కంటిన్యూ చేశాడు అభిజిత్. ఇద్దరూ హౌస్‌లో ఎవరు ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకు ఏమిటి అన్నదానిపై చర్చ నడిపారు.


ఇక వీళ్ల ముచ్చట్లను వింటూ ఉన్న అఖిల్.. అభిజిత్ అలా వెళ్లాడో లేదో.. వెంటనే మొనాల్ దగ్గరకు వచ్చి ముచ్చట్లు మొదలుపెట్టాడు. అటు అఖిల్- ఇటు అభిజిత్ బిగ్ బాస్ ఆట ఆడటం మాట అటుంచింది. మొనాల్‌కి బాడీగార్డ్స్‌లా షిఫ్ట్‌లు వేసుకుని మరీ డ్యూటీ చేస్తున్నట్టుగానే కనిపించారు.


ఇక అభి-మొనాల్‌లు ఇద్దరూ మాట్లాడుకోవడం చూసిన అఖిల్.. వెంటనే మొనాల్ దగ్గరకు వెళ్లి ఇది రియాలిటీ షో.. అన్ని కెమెరాలు అన్నింటినీ క్యాప్చర్ చేస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉండు.. నీ హార్ట్‌తో నువ్ మాట్లాడుకో.. బ్రెయిన్‌తో మాట్లాడకు అంటూ హితబోధ చేశారు.


నేను హార్ట్‌తోనే మాట్లాడుతున్నా.. దానికి బ్రెయిన్‌ని యూజ్ చేస్తున్నా అంటూ పంచ్ ఇచ్చింది మొనాల్. ఇక అఖిల్ పులిహోర కార్యక్రమంలో భాగంగా.. సెల్ఫ్ డబ్బా కొట్టడం స్టార్ట్ చేశాడు.. ‘నేను నాలాగే ఉండటానికి ట్రై చేస్తున్నా.. నాకు ఫీలింగ్స్ ఉంటాయి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండలేను.. ఎమోషన్స్‌ని నేను దాచుకోలేను. నాలో ఏదైనా ఫీలింగ్ ఉందంటే నా ముఖంలో కనిపించిపోతుంది.. నేను రియాక్ట్ అయితే రీజన్ ఉంటుంది. అభిజిత్ నా గురించి నీతో ఏమైనా చెప్తే నా దగ్గర చెప్పకు. అది నాకు నచ్చదు. అటు ఇటు ఉండకు.. నువ్ చెప్పినా నేను వినాలని లేదు.. నువ్వే బ్యాడ్ అవుతున్నావ్ మధ్యలో’ అంటూ తెగ ఫీల్ అయిపోయాడు అఖిల్.


ఇక లగ్జరీ బడ్డెట్‌లో భాగంగా.. మరో ఎంటర్ టైనింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దేత్తడి హారిక-మొహబూబ్, మొనాల్-సొహైల్‌లు డ్యుయెట్స్ సాంగ్స్‌కి, అమ్మా రాజశేఖర్ మాస్టర్ సోలో పెర్ఫామెన్స్ చేసి అలరించాలని.. ఈ డాన్స్ షోకి లాస్య, నోయల్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తారని.. మిగిలిన ఇంటి సభ్యులు మధ్య మధ్యలో యాడ్స్ చేయాల్సి ఉంటుందని.. ఈ మొత్తం కార్యక్రమానికి యాంకర్‌గా అరియానా వ్యవహరిస్తుందని తెలియజేశారు బిగ్ బాస్.


అయితే మొనాల్‌‌-సొహైల్ డ్యుయెట్ అనేప్పటికి అఖిల్ తెగ ఫీల్ అయిపోయాడు. వీరిద్దరూ డాన్స్ రిహార్సల్ చేస్తుంటే.. జీవితం మొత్తం కోల్పోయినవాడిలా ఫేస్ పెట్టి ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఉడికిపోయాడు. అతని ఫేస్‌లోని ఎక్స్ ప్రెషన్స్ గమనించిన లాస్య, అభిజిత్, సుజాతలు ముచ్చట్లు పెట్టారు. చూశావా? అక్కడ ఏం జరుగుతుందో.. మనోడు ఫేస్ ఎలా పెట్టాడో చూశావా అంటూ జోక్‌లు వేసుకున్నారు. మీ ఇద్దరిమధ్య ఏమైనా జరుగుతుందా? అని మొనాల్‌ని అడిగానని ఏం లేదని చెప్పిందంటూ లాస్య దగ్గర గుసగుసలాడాడు అభిజిత్.


ఇక డాన్స్ ప్రాక్టీస్ పూర్తి కాగానే అఖిల్‌తో తిరిగి ముచ్చట్లు పెట్టింది మొనాల్.. మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని అఖిల్ దగ్గర అనగా.. అఖిల్ తెగ ఫీల్ అయిపోయాడు. వాళ్లను పట్టించుకోవడం మానెయ్ అంటూ మొనాల్‌పై కోప్పడ్డాడు. అయితే నేను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మన మధ్య ఏదో నడుస్తుందని వాళ్లు అనుకుంటున్నారని.. నేను నీతో ఉండటం వల్ల వాళ్లకు నచ్చడం లేదని లాస్య, సుజాతల ఏదైతే చెప్పారో అఖిల్‌కి పూసగుచ్చినట్టు చెప్పేసింది మొనాల్.


ఇక అఖిల్‌తో చర్చ ముగియగానే మళ్లీ అభిజిత్‌తో ముచ్చట్లు షురూ చేసింది మొనాల్.. హౌస్‌లో కొంత మంది మన ముందు ఒకలా తరువాత ఒకలా మాట్లాడుతున్నారని.. ఫ్లిప్ పర్శనాలిటీలను చూస్తే నాకు నచ్చడం లేదని ఫీల్ అయ్యింది మొనాల్.


 


డాన్స్‌లతో బిగ్ బాస్ హౌస్‌ని షేక్ చేసిన కంటెస్టెంట్లు..


ఇక డాన్స్‌లో భాగంగా సినిమా చూపిస్త మామా సాంగ్‌కి రాజశేఖర్ మాస్టర్ మాస్ స్టెప్పులు వేశారు. ఇక వానా వానా వెల్లువాయే సాంగ్‌కి మొనాల్‌తో కలసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు సొహైల్. ఈ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. మంచి ఈడు జోడుగా అట్రాక్ట్ చేశారు. అయితే టాప్ లేచిపెద్ది సాంగ్‌కి మొహబూబ్, హారికలు నిజంగానే టాప్ లేపేశారు. మాస్ స్టెప్పులతో బిగ్ బాస్ హౌస్‌ని షేక్ చేసేశారు. దేత్తడి హారిక మరోమారు హాట్ పెర్ఫామెన్స్ ఇస్తే.. మొహబూబ్ ఆమెకు సరిజోడి అనిపించాడు. సాంగ్ మధ్యలో హారికను కిస్ చేయడం హైలైట్ అయ్యింది. ఈ ఇద్దరూ పెర్ఫామర్ ఆఫ్ ద డాన్స్‌ షోగా నిలిచారు.


 


ఇక రేపటి ఎపిసోడ్‌లో మరో సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెడుతున్నాడు. జోకర్ అంటూ హింట్ ఇవ్వడంతో పాటు అతను జబర్దస్త్ అవినాష్ అని ప్రోమోని బట్టి అర్థమౌతోంది. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్‌లో.
Recent Post