ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచి పాత్రలు రావాలంటే, హీరోలతో సన్నిహితంగా ఉండాలి : కంగనా

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 11:24 AM



ఇప్పటికే తన వ్యాఖ్యలతో ఎంతో సంచలనాన్ని రేపిన నటి కంగనా రనౌత్, ఈ దఫా కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలతో మరింత సంచలనాన్ని కలిగించింది. పార్లమెంట్ లో జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చిన కంగన, చిత్ర పరిశ్రమకు స్త్రీవాదాన్ని నేర్పింది తానేనని అన్నారు. అంతటితో ఆగకుండా, "సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి. మంచి పాత్రలు రావాలంటే, హీరోలతో సన్నిహితంగా ఉండాలి. తప్పదనుకుని నేను కూడా ఓ హీరోతో సన్నిహితంగా ఉన్నా. దీని ఫలితంగా రెండు నిమిషాల నిడివితో ఉన్న ఓ రొమాంటిక్ పాత్ర లభించింది. ఆపై ఐటమ్ నంబర్స్... ఆదిలో నన్ను శృంగారపరంగానే చూపించేవారు" అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం జయాబచ్చన్ ఏమీ కాదని, మంచి కథలను ఎంచుకోవడమేనని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయ పార్టీలో టికెట్ పొందటం పెద్ద కష్టమైన పనేమీ కాదని తెలివైన వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని కంగన వ్యాఖ్యానించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com