ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖిల్ పెళ్లి .....చక్రం తిప్పిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 01:45 PM



లాక్‌డౌన్ వేళ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరుగా ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా పెళ్లి చేసుకొని బ్యాచిలర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టగా.. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సిద్దమైనట్లు హింట్స్ ఇచ్చారు. ఇకపోతే ఇదే సమయంలో అక్కినేని ఫ్యామిలీ కూడా పెళ్లి బాజాలు మోగించేందుకు రెడీ అయిందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అక్కినేని నాగార్జున తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో


అఖిల్ పెళ్లి పీటలెక్కబోతున్నారని, ఆ బాధ్యతలను అతని వదిన సమంత తీసుకుందని ఫిలింనగర్‌లో టాక్ మొదలైంది.నిజానికి అఖిల్ మ్యారేజ్ విషయం ఎప్పటినుంచో మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్య పెళ్లి అయిన రెండు మూడు నెలల్లోనే అఖిల్ పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. అప్పట్లోనే శ్రేయా భూపాల్‌తో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయి అనూహ్యంగా క్యాన్సిల్ అయింది. దానికి కారణాలేంటనేది అఫీషియల్‌గా తెలియనప్పటికీ.. అప్పటి నుంచి అఖిల్ పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ ఇష్యూ గానే నడుస్తోంది. ఆ తర్వాత తనకు వరుసకు మామ అయిన వెంకటేష్ కూతురితో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఓ వ్యక్తి ప్రకటించడంతో అది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది.


 


ఇక ఇన్నిరోజులకు అఖిల్ పెళ్లి మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ సీక్రెట్‌‌గా అఖిల్ పెళ్లికి సంబంధించిన పనులు చేస్తున్నారని, రీసెంట్‌గా ఓ ఫేమస్ బిజినెస్‌మెన్ కూతురితో అఖిల్ పెళ్లి ఫిక్స్ కూడా చేసేశారని ఫిలింనగర్ జనం చెప్పుకుంటున్నారు. అంతేకాదండోయ్.. దీని వెనుక అఖిల్ వదిన సమంత హస్తం ఉందని, ఆమెనే ఇరు కుటుంబాలను మెప్పించి అఖిల్ పెళ్లి బాధ్యత భుజాలపై వేసుకుందని అంటున్నారు. దీంతో మరోసారి అఖిల్ పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయింది.


ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే.. ''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయిన ఈ యంగ్ హీరో తన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అతిత్వరలో రిలీజ్ కానుంది. ఇందులో అఖిల్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com