ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ సినిమాలో ఊహించని షాక్..

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 02:32 PM



టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా ముందు చేసే హడావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా ప్రకటన నాటి నుంచి కూడా సినిమా విడుదలయ్యే వరకు ఆయన ఫ్యాన్స్ హడావుడే ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ముందే ఊహించుకుంటూ ఉంటారు కొంతమంది. అలా ఉంటుంది ఇలాలా ఉంటుంది అని దాని గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా చర్చలు కూడా చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపుగా ఆరు సినిమాలు పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు నానీని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి క్రిష్ ఇప్పటికే నానికి ఫోన్ కూడా చేశాడని టాక్.
నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం, దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నానిని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు. వీ సినిమాలో నెగటివ్ పాత్ర బాగా పోషించాడు. అందుకే ఇప్పుడు తన సినిమాలో నెగటివ్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాడు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే సినిమాలో కొంత భాగం షూటింగ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com