గత కొద్దిరోజులుగా హౌజ్ నుంచి పంపించండని వేడుకుంటున్న గంగవ్వ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో బిగ్‌బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. అందరూ బాగానే చూసుకుంటున్నారు, కానీ భర్త కొట్టిన దెబ్బలు ఇప్పుడు మళ్లీ నొప్పెడుతున్నాయని చెప్పింది. నాకిక్కడ వాతావారణం, ఆహారం పడతలేదని ఏడుస్తూ గోడు వెల్లబోసుకుంది. మట్టిలో తిరిగేదాన్ని, ఇక్కడ ఉండలేకపోతున్నానని గంగవ్వ చెప్పారు. రెండు నెలలు ఉందామనే వచ్చాను, కానీ తన వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా ఇప్పటివరకు గంగవ్వను గెలిపిద్దాం అనుకున్న అభిమానులు తాజా ఎపిసోడ్ చూశాక మనసు మార్చుకుంటున్నారు. ఆమె పడుతున్న అవస్థను కళ్లారా చూసిన తర్వాత ఆమెను ఇంక ఇంటికి పంపించేయడమే బెటర్ అంటున్నారు.