ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ నాకు సారీ చెప్పాలి.. నోయల్ షాకింగ్ కామెంట్స్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 19, 2020, 12:49 PM



టాప్ రియాలిటీ షో అంటే ఇప్పుడు అందరి నోటా వినపడే పేరు బిగ్ బాస్..తెలుగు లో మూడు సీజన్లు పూర్తి చేసుకొని నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది.మూడు , నాలుగు సీజన్ల కు హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు షో మొదలై రెండు వారాలు కావొస్తోంది. మొదటి ఎలిమినేషన్ లో డైరెక్టర్ సూర్య కిరణ్ అవ్వగా, ఇప్పుడు రెండో ఎలిమినేషన్ నామినేషన్ పూర్తయ్యింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
మొన్నటి వరకు సైలెంట్ గా సాగిన ఈ షో ఇప్పుడు ఘాటైన మసాలాలతో, మత్తెక్కించే అమ్మాయిల స్టెప్స్ తో దద్దరిల్లిపోతుంది. ఇక బిగ్ బాస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా బిగ్ బాస్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది.ఒక్కక్కరు ఒక్కో తీరులా మారిపోయారు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వ.. తనకు ఆరోగ్యం బాలేదని.. నన్ను ఇంటికి పంపించండి అని బిగ్ బాస్‌కి తెగేసి చెప్పింది. ప్రస్తుతం గంగవ్వకు బిగ్ బాస్ హౌస్‌లోనే వైద్య పరీక్షలు చేస్తుండగా.. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో ఉంచుతారా? లేక బయటకు పంపేస్తారా? అని ఆమె అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇప్పుడు మరో కంటెస్టెంట్‌ నోయల్ కూడా అదే అనడం గమనార్హం..తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో తెలుగులో మాట్లాడటం లేదని, టైమ్ ను పాటించలేదని పనిష్మెంట్ ఇచ్చింది. దీనికి సీరియస్ అయిన నోయల్ బిగ్ బాస్ వచ్చి నాకు సారీ చెప్పాలంతే.. తాను ప్రకృతి లాంటోడినీ ఎంత మంచిగా ఉంటుందో అంతే చెడ్డగా ఉంటుందని.. వాళ్లు నన్ను కెలికారని.. ఇక తనేంటో చూపిస్తా బస్తీ మే సవాల్.. నేను ఈ శనివారం వెళ్లిపోవడానికి డిసైడ్ అయ్యా.. నాకు ఈ బిగ్ బాస్ హౌస్ వద్దు.. నాగార్జున సార్‌కి చెప్పి వెళిపోతా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం నోయల్ కెప్టెన్ భాద్యతలను చేపట్టారు. మరి ఈ విషయం గురించి పూర్తి విషయం తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను తప్పక చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com