'కేజీఎఫ్' దర్శకుడితో... ఎన్టీఆర్...

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 12:59 PM

ఆమధ్య వచ్చిన 'కేజీఎఫ్' చిత్రంతో ఒక్కసారిగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతని శైలి చూసి, అతనితో సినిమాలు చేయాలని చాలామంది హీరోలు కోరుకున్నారు. ఈ కోవలో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, ప్రభాస్ పేర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో ప్రాజక్టు గురించి ప్రత్యేకంగా హైదరాబాదు వచ్చిమరీ ప్రశాంత్ చర్చలు జరిపాడు. అతను చెప్పిన కథను ఎన్టీఆర్ కూడా ఓకే చేసేశాడని వార్తలొచ్చాయి.


ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే చిత్రం ఎలాంటి థీమ్ తో సాగుతుందన్న అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారాన్ని బట్టి, ఈ చిత్రం బయోవార్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రలో సరికొత్త మేకోవర్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఈ గెటప్ కు సంబంధించి వర్క్ కూడా చేస్తున్నారట.


ఇదిలావుంచితే, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని షూటింగ్ ఇంకా మిగిలివుంది. మరికొన్నాళ్లలో ఆ షూటింగును మొదలెడతారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తాడు. ఇక అది చివరి దశలో వుండగా ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.    
Recent Post