బిగ్ బాస్ నుండి ఈ వారం ఇద్దరు అవుట్..?

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 01:36 PM

బిగ్ బాస్ లో ఈ వారం ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. హౌస్ లో మొత్తం 16 మంది ఉండగా.. మొదటి వారంలో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆయన స్థానంలో సాయి కుమార్ వచ్చేశాడు. ఆ తర్వాత జబర్దాస్త్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ వారం ఇద్దరు బయటకు వెళతారని సమాచారం.
అందులో ఒకరు కరాటే కల్యాణి అని తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఎలిమినేషన్ దాదాపుగా ఖరారైందట. ఆమెతో పాటు మరోకరు కూడా బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే అది గంగవ్వే కావచ్చనేది టాక్. కారణం ఆమెకు అక్కడి వాతావరణం పెద్దగా నచ్చట్లేదట. దీంతో బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటోందట గంగవ్వ.
Recent Post