'బిగ్ బాస్' పై షాకింగ్ కామెంట్ చేసిన నటి వితిక

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 02:10 PM

బిగ్ బాస్ అతి పెద్ద రియాల్టీ షో. తెలుగు లో కూడా బిగ్ బాస్ విజయవంతంగా దూసుకు పోతుంది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి అదిరిపోయే రేటింగ్ ఇచ్చాడు. ఆతర్వాత నాని సీజన్ 2కు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ అంత ఆకట్టుకోలేక పోయాడని టాక్ నడిచింది. ఇక బిగ్ బాస్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి ఊపు తెచ్చారు. ఆతర్వాత ఇప్పుడు సీజన్ 4 కూడా మొదలైంది మరోసారి నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన చాలా మంది బయటకు వచ్చి షో పై విమర్శలు చేయడం చూసాం. తాజాగా వితిక షేరు. కూడా బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వితిక . 15 ఏళ్ల వయసులో కన్నడ మూవీ "అంతు ఇంతు ప్రీతి బంటు"లో నటించింది వితిక. ఆతర్వాత తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మంచు మనోజ్ నటించిన "ఝుమ్మంది నాదం " , 'భీమిలి కబడ్డీ జట్టు', 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాల్లో నటించింది.
ఆతర్వాత హీరో వరుణ్ తేజ్ ను పెళ్లాడింది. ఇక వితిక బిగ్ బాస్ సీజన్ 3 లో భర్త వరుణ్ తేజ్ తో కలిసి కంటెస్టెంట్ గా పాల్గొంది . తాజాగా బిగ్ బాస్ పైన ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. వితిక మాట్లాడుతూ ..
"బిగ్ బాస్'' లో మంచి వుంది ,చెడూ వుంది. 24 గంటల జీవితంలో బిగ్ బాస్ గంటలో క్యారెక్టర్ లని డిసైడ్ చేస్తుంటారని.. ఇందులో పాల్గొనే వాళ్లు నటనే కాకుండా కొంత అతి కూడా చేస్తారని చెప్పుకొచ్చింది.
Recent Post