వంటలక్కను బీట్‌ చేయలేకపోయిన ‘బిగ్ బాస్-4’

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 03:26 PM

తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ప్రసారమైన బిగ్‌ బాస్‌ షోలకు సంబంధించి.. అన్నిటికంటే అత్యధిక టీఆర్పీ 18.5ని బిగ్ బాస్ 4 షో సాధించినట్లు స్టార్‌ మా తెలిపింది. స్టార్‌ మా చెబుతున్న గణాంకాలను బట్టి చూస్తే.. స్టార్‌ మా గతంలో లేనంతగా అత్యధికంగా 1122 జీపీఆర్‌లతో తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరీలో టాప్‌ స్థానంలో కొనసాగుతోంది. గత నాలుగు వారాలతో పోలిస్తే స్టార్‌ మా సరికొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ 18 శాతం పెరిగినట్లుగా రివీల్‌ చేసింది.
అయితే, ‘బిగ్ బాస్-4’ ఫస్ట్ వీక్ రిజల్ట్ మరోలా ఉంది. కంటెస్టెంట్స్ వీక్‌గా ఉన్నారనే కామెంట్స్ ‘బిగ్ బాస్-4’ని చుట్టుముట్టినా.. ఈ రియాలిటీ షో ఓపెనింగ్ ఎపిసోడ్‌కు మాత్రమే అత్యధిక (18.5) టీఆర్పీ రావటం విశేషం. ఇది మంచి రేటింగే అయినా... ‘మా’లోనే ప్రసారమవుతున్న వంటలక్క, డాక్టర్ బాబు డ్రామా ‘కార్తీకదీపం’, కస్తూరి ‘గృహలక్ష్మి’ సీరియల్స్ రేటింగ్ ను మాత్రం ఈ షో బీట్‌ చేయలేకపోయింది. కార్తీక దీపం మొదటి ఆరు స్థానాల్లో నిలవగా... ఆ తర్వాత గృహలక్ష్మి, ఆపై బిగ్ బాస్-4 నిలవటం గమనార్హం.
Recent Post