ఓ మహిళ మెసేజ్ కు సోనమ్ ఘాటు రిప్లై...

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 04:07 PM

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలపై సాధారణ ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్టార్ కిడ్స్‌పై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. ప్రముఖ హీరో అనిల్ కపూర్ కూతురు, హీరోయిన్ సోనమ్ కపూర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఓ మహిళ తాజాగా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్‌కు సోనమ్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.


`మీ నాన్న లేకపోతే నువ్వు శూన్యం. నీకు నటించడం కూడా రాదు. స్టార్ వారసత్వం వల్లే కొన్ని సినిమాలు చేయగలిగావు. నీలాంటి వారు సమాజంలో నెగిటివిటీనీ వ్యాప్తి చేశారు. నీలాంటి మహిళకు భారత్‌తోపాటు ఈ ప్రపంచం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషకరం. నీ భర్త చాలా అందంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో! మరోసారి ఆయణ్ని చూడు. ఎంత అందవిహీనంగా ఉన్నాడో తెలుస్తుంద`ని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌కు సోనమ్ స్పందిస్తూ.. `ఈ మహిళ నాకు నీచమైన మెసేజ్ పంపింది. ఇలాంటి మెసేజ్‌ల ద్వారా ఫాలోవర్స్‌ను సంపాదించాలి అనుకుంటున్నావు. నా దృష్టిలో పడడానికే నువ్వు ఈ మెసేజ్ పంపావని తెలుసు. ఈమె వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఇంత ద్వేషం మనసులో ఉంటే అది వారినే నాశనం చేస్తుంద`ని రిప్లై ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆ మెసేజ్ పంపిన మహిళ స్పందిస్తూ.. తన ఖాతా హ్యాక్ అయిందని, తనెప్పుడూ ద్వేషంతో కూడిన మెసేజ్‌లను పంపనని పేర్కొంది. 
Recent Post