జెర్సీ సినిమా డైరెక్టర్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 04:12 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని తెరపై చూసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది.2018 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ఆ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తన తర్వాతి సినిమా ను ప్రకటించాడు.మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా పేరు రౌద్రం రణం రుధిరం.
ఇక జక్కన్న సినిమా అంటే దాదాపు చాలా సమయం పడుతుందని తెలిసిన విషయమే. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే దానికి తోడు కరోనా వచ్చి అంతా తారుమారు చేయడమే. ఈ లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యింది.ఇక ప్రస్తుతం rrr సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కాబోతోంది. ఇదిలా ఉంటె తన తర్వాతి సినిమా ను త్రివిక్రమ్ తో చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు ఎన్టీఆర్. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. ఈ సినిమా దసరా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలు సెట్స్ పై ఉండగానే తారక్ ఇప్పటికే చాలా కథలు వింటూ, వాటిని ఓకే చేస్తున్నాడని తాజా సమాచారం.
ఇక ఇప్పుడు టాలివుడ్‌లో తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, తారక్‌ను జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కలిసి తన కథను వివరించారు అని టాక్.ఎన్‌టిఆర్‌ను ఆ కథ ఆకట్టుకోగా, గౌతమ్‌ను పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని తారక్ కోరాడంట.
ఈ ప్రాజెక్ట్ అన్ని విధాల ఓకే అయితే 2022 లో పట్టాలెక్కబోతుంది అని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకి మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాను ఎన్.టి.ఆర్ తానే సొంతంగా ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏం జరగనుందో వేచి చూడాలి మరి.
Recent Post