ప్రముఖ నటుడు, డ్యాన్సర్ అరెస్ట్...!

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 20, 2020, 09:33 AM

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో సీసీబీ పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తితోపాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఇకపోతే శాండల్ వుడ్ లో హీరోయిన్స్ సంజనా, రాగిణి ద్వివేదీలతోపాటు మరికొందరు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా బాలీవుడ్ నటుడు, డ్యాన్సర్ ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలను తరలిస్తున్న బాలీవుడ్‌కు చెందిన నటుడు కిశోర్‌ శెట్టిని మంగళూరులో సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలీవుడ్‌లో ఎబీసీడీ అనే సినిమాలో నటించిన కిశోక్‌శెట్టి ఒక డ్యాన్సర్‌. బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి, డ్రగ్స్‌ లింక్‌పై ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో కిశోర్‌శెట్టి పోలసులకు చిక్కాడు. కిశోర్‌ మిత్రుడు ప్రతీక్‌శెట్టిని కూడా బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.
Recent Post