ఆ డైరెక్టర్ నన్ను బలవంతం చేయబోయాడు: నటి పాయల్

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 20, 2020, 10:00 AM

భారతీయ సినీ పరిశ్రమలో మీటూ అంశం కలకలం రేపింది. చాలా మంది హీరోయిన్స్ డైరెక్టర్లపైనా....హీరోలపైనా అనేక ఆరోపణలు చేశారు. దాంతో సినీ పరిశ్రమలో మీటూ అంశం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇదే అంశానికి సంబంధించి మరో హాట్ హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయబోయాడంటూ ఆరోపించారు. తనకు ఒకరోజు అనురాగ్ కశ్యప్ నుంచి ఫోన్ వచ్చిందని దాంతో ఆయన్ను కలిసేందుకు వెళ్లినట్లు ఆమె తెలిపింది. ఆ సమయంలో ఆయన మందు తాగుతున్నాడని... గంజాయిలాంటి పదార్థాన్ని కూడా తీసుకుని ఉంటాడనుకుంటానని ఓ ప్రముఖ చానెల్ ఇంటర్వ్యూలో పేర్కొంది. రణబీర్ కపూర్ సినిమాలో కనీసం ఒక సీన్ లో అయినా నటించాలనుకునే అమ్మాయిలు తనతో పడుకోవాలనుకుంటారని చెప్పాడని ఆరోపించింది. అమితాబ్, కరణ్ జొహార్ తనతో మాట్లాడుతుంటారని చెప్పాడని వెల్లడించింది. ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద సమస్య కాదన్నట్టు మాట్లాడారని పాయల్ చెప్పింది. రిచా చద్దా, మహిగిల్, హ్యుమా ఖురేషి వంటి హీరోయిన్లు తనకు ఫోన్ కాల్ దూరంలో ఉంటారని అన్నాడని తెలిపింది. తాను కూడా ఏం చేయమంటే అది చేస్తానని అనుకున్నాడని... బలవంతం చేయబోయాడని చెప్పింది. అయితే, తర్వాత కలుస్తానని చెప్పి తాను తప్పించుకున్నానని తెలిపింది. ఈ సందర్భంగా పాయలో ఘోష్ తనకు రక్షణ కల్పించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్ చేశారు. తనకు ఓ డైరెక్టర్ నుంచి ప్రమాదం ఉందని తనని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంపై దృష్టి పెట్టి అనురాగ్‌ కశ్యప్‌ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ ద్వారా ప్రధానిని కోరింది. ఆ డైరెక్టర్ తనను బలవంతం చేయబోయాడని అతడిని అరెస్ట్ చేసి అతని మొహాన్ని ప్రపంచానికి చూపించండి అంటూ కోరింది. ఇది నాకు హాని కలిగిస్తుందని, నా భద్రతకు ప్రమాదమని తెలుసు. దయచేసి సహాయం చేయండి అంటూ ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Recent Post