సంజనపై సంచలన ఆరోపణలు చేసిన ప్రశాంత్ సంబర్గి

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 20, 2020, 10:25 AM

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం రిమాండ్ నిందితురాలిగా ఉన్న నటి సంజనా గల్రానీ, లవ్ జీహాద్ లో చిక్కుకున్నారని, ఆమె మతం మార్చుకుని మహీరాగా మారారని ప్రముఖ సమాచార హక్కుల కార్యకర్త ప్రశాంత్ సంబర్గి, సంచలన ఆరోపణలు చేశారు. 2018లోనే ఈ ఘటన జరిగిందని, ఆమె హిందూ మతాన్ని వీడి, ముస్లిం మతానికి మారిపోయారని చెబుతూ, అందుకు సాక్ష్యంగా ఆమె మతాన్ని మారుస్తూ ముస్లిం పెద్దలు ఇచ్చిన సర్టిఫికెట్ ను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.


కాగా, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజనపై బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చార్జ్ షీట్ ను రూపొందించి, కోర్టుకు అందించారు. ఆమెను దాదాపు వారం రోజుల పాటు విచారించిన పోలీసులు, పలు కీలక వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఎఫ్ఐఆర్ లో ఆమె పేరు సంజనా గల్రానీ అని మాత్రమే పేర్కొన్నారు. మహీరా అన్న పేరు ఎక్కడా లేదని తెలుస్తోంది.
Recent Post