పాయల్‌ ఆరోపణలపై స్పందించిన అనురాగ్‌ కశ్యప్

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 20, 2020, 12:19 PM

డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ తనను బలవంతంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని నటి పాయల్ ఘోష్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పాయల్‌ ఆరోపణలపై అనురాగ్‌ కశ్యప్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. "చాలా కాలం మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నారు. పరవాలేదు.. నువ్వొక అమ్మాయిగా ఉండి ఇతర అమ్మాయిలను ఈ వివాదంలోకి లాగావు. దేనికైనా ఓ లిమిట్‌ ఉంటుంది. నువ్వు నాపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. నాపై ఆరోపణలు చేసే క్రమంలో నాతో పనిచేసిన నటీమణులను, బచ్చన్‌ ఫ్యామిలీని కూడా వ్యవహారంలోకి లాగావు. నేను రెండుసార్లు పెళ్లి చేసుకున్నాను. అదే నా నేరమైతే నేను అంగీకరిస్తాను. నా మొదటి భార్య, రెండవ భార్య లేదా నా ప్రేయసి కావచ్చు లేదా నాతో పనిచేసిన నటీమణులు కావచ్చు.అందరిపై మీరు ఆరోపణలు చేశారు. మీ ప్రవర్తన భరించలేనిది. మీ వీడియో చూస్తే అందులో నిజా నిజాలెంత ఆనే విషయాలు తెలుస్తున్నాయి. మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడితే నేను తెలుగులో మాట్లాడాను ఏమీఅనుకోకండి" అని అన్నారు అనురాగ్‌ కశ్యప్‌. 
Recent Post