బిగ్ బాస్ హౌస్ నుండి కళ్యాణితో పాటు... కుమార్ సాయి

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 20, 2020, 01:50 PM

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్, రెండో వారంలోకి ప్రవేశించింది. నేడు సెకండ్ ఎలిమినేషన్. ఇవాళ ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ ను వీడి బయటకు రానున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిలో ఒకరు కరాటే కల్యాణి కాగా, నామినేషన్స్ లో ఉన్న గంగవ్వను బిగ్ బాస్ సేఫ్ జోన్ లోకి పంపేశాడు.


ఇక, నామినేషన్స్ లో మిగిలింది నోయల్, మోనాల్ గుజ్జర్, సయ్యద్ సోహైల్, అమ్మ రాజశేఖర్, సాయి కుమార్, అలేఖ్య హారిక, అభిజిత్ కాగా, వీరిలో కుమార్ సాయి నేడు ఎలిమినేట్ కాబోతున్నాడని లీక్ అయింది. ఈ ఎపిసోడ్ ను నిర్వాహకులు ఇప్పటికే చిత్రీకరించగా, ప్రతి ఏటా వస్తున్నట్టుగానే, బిగ్ బాస్ హౌస్ లో మరుసటి రోజు జరిగే ఘటనల గురించి ముందే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే విధంగా నేడు సాయి కుమార్ ఎలిమినేట్ కానున్నాడని ప్రచారం జరుగుతోంది.
Recent Post