ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా కెప్టెన్‌ మణిశర్మ అని ఆయన కవర్‌ డ్రైవ్‌ ఆడటంలో స్పెషలిస్ట్‌ : తమన్

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 20, 2020, 05:03 PM



మ్యూజికల్‌ సెన్సేషన్‌ తమన్‌.. కెరీర్‌ ప్రారంభంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ శిష్యుడు. ఇప్పుడు గురు శిష్యులిద్దరూ అగ్ర సంగీత దర్శకులుగా తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే మణిశర్మతో సహా ఇతర టెక్నీషియన్స్‌తో పనిచేసేటప్పుడు తమన్‌ తీరిక సమయాల్లో క్రికెట్‌ ఆడేవాళ్లు.. 2005లో అలా ఓసారి క్రికెట్ ఆడినప్పుడు ఓ ఫొటో తీసుకున్నారు. ఆ త్రో బ్యాక్‌ ఫొటోను తమన్‌ ఈరోజు ట్వీట్‌ చేశారు. మా కెప్టెన్‌ మణిశర్మ అని ఆయన కవర్‌ డ్రైవ్‌ ఆడటంలో స్పెషలిస్ట్‌ అని చెబుతూ తామందరం మహతి స్టూడియోలో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం తమన్‌ సంగీతం అందిస్తున్న మిస్‌ ఇండియా, సోలో బ్రతుకే సో బెటర్‌, క్రాక్‌, టక్‌ జగదీష్‌, వకీల్‌సాబ్‌ సినిమాలు వచ్చే ఏడాది సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com