సంజయ్ కపూర్ బర్త్ డే పార్టీలో అరోరా సిస్టర్స్ రచ్చ

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 19, 2020, 09:19 AM

బాలీవుడ్ బ్యూటీస్  అరోరా సిస్టర్స్  లేటెస్టుగా  నటుడు కం నిర్మాత సంజయ్ కపూర్ బర్త్ డే పార్టీలో చేసిన రచ్చ హాట్ టాపిక్ గా మారింది. `ఎనర్జిటిక్ చాచు` అంటూ సిస్టర్స్ సంజయ్ కపూర్ ను చుట్టేశారు. పిచ్చ పిచ్చగా పార్టీని సెలబ్రేట్ చేశారు. అర్జున్ కపూర్ -మలైకా అరోరా జోడీ ఇప్పటికే సంజయ్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ జంట సంజయ్ తో    ఫోటోలను పంచుకున్నారు. అవి ఇంటర్నెట్ లో అగ్గి రాజేసాయి. సంజయ్ కపూర్ ఈ రోజుతో ఒక సంవత్సరం పెద్దవాడయ్యాడు.  సంజయ్ తో రెండు అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది మలైకా అరోరా. మొదటి ఫోటోలో సంజయ్ ఆమె సోదరి అమృత అరోరాతో కలిసి మలైకా కనిపిస్తోంది. మరొక ఫోటోలో రంగురంగుల షేడ్స్ తో  కూడిన గూఫీ అవతారంలో సంజయ్ తో కలిసి గాలా మూడో లో కనిపించింది.


 


 


 
Recent Post