కొత్త ద‌ర్శ‌కుడితో బెల్లంకొండ కొత్త మూవీ ప్రారంభం

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 22, 2018, 03:36 PM
 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వంశధార క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. శ్రీనివాస్‌ దర్శకుడు. నవీన్‌ పొంటినేని (నాని) నిర్మిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.. ముహూర్తం షాట్ కు ద‌ర్శ‌కుడు వి వి వినాయ‌క్ క్లాప్ ఇచ్చారు..ఈ సంద‌ర్బంగా నిర్మాత నానీ మాట్లాడుతూ దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్‌ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్‌ అద్భుతమైన కథని సిద్ధం చేశారు. సినిమాటోగ్ర‌ఫీ ని చోటా కె.నాయుడు, సంగీతం థ‌మన్ అందిస్తున్నారు, ఈ రోజు నుంచి లాంఛ‌నంగా షూటింగ్ ప్రారంభిస్తున్నాం అని వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు అధికారికంగా తెలీయ‌జేయ‌నున్నారు..
Recent Post