సినిమాలు లేఖ సీరియల్ వైపు సంజన చూపు

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 22, 2018, 03:44 PM
 

బిగ్‌స్క్రీన్‌ దూరం పెడితే, స్మాల్‌ స్క్రీన్‌ స్వాగతం పలుకుతోంది. అవకాశాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్న నటి సంజన ఇప్పుడు బుల్లితెర నటిగా మారింది. గ్లామర్‌ పాత్ర ద్వారా సంజన (29) టాలీవుడ్‌ ప్రవేశించింది. ఆమె తొలి చిత్రం బుజ్జిగాడు. అంతకుముందే కన్నడలో పలు సినిమాల్లో నటించింది. 13 ఏళ్ల కెరీర్‌లో నటించిన చిత్రాలు తక్కువే. నిత్యం వార్తల్లో ఉండేందుకు తెగ ఆరాటపడే సంచజన హీరోయిన్‌ వేషాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఆ మధ్య కొత్తనాయికల ప్రవేశం ఎక్కువ కావడంతో ఆమెను పట్టించుకున్నవారే లేరు. దాంతో మరిన్ని రోజులు వెయిట్‌ చేస్తే మొదటికే మోసం అని తెలుసుకుందో ఏమోకానీ టీవీ సీరియల్లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని అంటున్నారు. టీవీలో నటించడం అంటే రేంజ్‌ తగ్గినట్టు కాదని ఆమె సన్నిహితులు అంటున్నారు. రమ్యకృష్ణ, మీనా వంటి సీనియర్లు టీవీల్లో కనిపించినా, ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించారని వారు గుర్తుచేస్తున్నారు. సంజన నటిస్తున్న సీరియల్‌ పేరు స్వర్ణఖడ్గం. ఇందులో ఆమె మహారాణి పాత్రలో కనిపిస్తుందట. టైటిల్‌, పాత్ర వింటుంటే ఇది భారీ బడ్జెట్‌ సీరియల్‌ అని స్పష్టమవుతోంది. బుల్లితెరపై సంచన రాణంచాలని కోరుకుందాం.
Recent Post