అమ్మ కాకుండానే పెద్దమ్మ అయిపొయింది!

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 22, 2018, 04:48 PM
 

మన సొసైటీలో సాధారణంగా పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయరు. కాబట్టి.. మరీ ఆలస్యంగా పిల్లలు పుట్టడం జరిగితే తప్ప.. ఏ అమ్మాయీ అమ్మ కాకుండా పెద్దమ్మ అవ్వదు.

అయితే సినిమా హీరోయిన్స్ విషయంలో ఇటువంటి విడ్డూరాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కెరీర్ పీక్ లో ఉండగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తమ్ముళ్లు, చెల్లెళ్లకు పెళ్లిళ్లు జరిపించేసి పెద్దమ్మను, మేనత్తలు అయిపోతుంటారు.

క్రీజీ కాజల్ విషయంలో ఇలాగే జరిగింది. కాజల్ సోదరి నిషా అగర్వాల్ తల్లి కావడంతో కాజల్ కాస్తా పెద్దమ్మ అయిపొయింది. కరణ్ వచ్చేలా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న నిషా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ కాజల్ స్వయంగా ప్రకటించుకోవడం విశేషం!
Recent Post