‘మోసం చేసిన భార్యను చంపాలా? లేక ఆమెతో ఉన్న వ్యక్తిని చంపాలా?

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 22, 2018, 04:51 PM
 

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్లాక్ ‌మెయిల్‌’. అభినయ్‌ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్‌లో.. ఇర్ఫాన్‌ భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. అది చూసిన ఇర్ఫాన్‌ ‘మోసం చేసిన తన భార్యను చంపాలా? లేక ఆమెతో ఉన్న వ్యక్తిని చంపాలా?’ అని తన స్నేహితుడితో చర్చిస్తుంటాడు. ఈ రెండూ కాకుండా మోసం చేసిన భార్యను బ్లాక్‌మెయిల్‌ చేయాలని ఇర్ఫాన్‌ నిర్ణయించుకుంటాడు.


అలా తన భార్య ఫొటోలను తానే పంపుతూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటాడు ఇర్ఫాన్. ఇర్ఫాన్‌ బ్లాక్‌మెయిల్‌ ప్లాన్‌ తెలిసి ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు కూడా ఇదే విధంగా ఇర్ఫా్‌న్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకుంటారు. ఒకరినొకరు బ్లాక్‌మెయిల్‌ చేసుకుంటూ చివరికి ఎవరు గెలిచారు అన్నదే ఈ సినిమా కథ. ఇందులో ఇర్ఫాన్‌ భార్యగా కృతి కుల్హరి నటించారు. ఏప్రిల్‌ 6న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఇర్ఫాన్‌ ఖాన్‌ తెలుగులో వచ్చిన ‘సైనికుడు’ సినిమాలో విలన్‌గా నటించారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌ చిత్రాల్లోనూ ఇర్ఫాన్‌ నటించారు.Recent Post