సినిమా రంగం అంటే హంగు ఆర్భాటానికి కొదవే ఉండదు. ఇక క్రేజీ స్టార్స్ గురించి చెప్పనక్కర్లేదు. వారి దగ్గరున్న ప్రతి వస్తువును ఖరీదుగా, క్వాలిటీగా ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ల దగ్గరున్న వాటిలో హ్యాండ్ బ్యాగ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొందరు. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్‌ను ఉపయోగిస్తుంటారు. అలాంటి కొందరిలో హీరోయిన్ కైరా అద్వానీ కూడా చేరింది. అటు బాలీవుడ్, ఇటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కైరా అద్వానీ స్టైల్ విషయంలో చాలా పర్టికులర్‌గా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా ఆమె చాలా కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్‌ను ఉపయోగిస్తుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ధర అచ్చంగా 3700 డాలర్స్. అంటే మన కరెన్సీ ప్రకారం చూస్తే రూ.277000. ఈ విషయం తెలిసినవారు అబ్బో కైరా అని అనుకుంటున్నారు.