అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిపింది : చిరంజీవి

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 12:53 PM

తనలోని ఫొటోగ్రాఫర్‌ను బయటకు తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన ఇంటి వద్ద పూసిన మందారాలను అందంగా ఫొటోలు తీసి, వాటిపై కవిత రాసి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన  కొప్పుని  సింగారించింది.. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిపింది’ అని ఆయన కామెంట్ చేశారు.


కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి కొన్ని నెలలుగా ఇంటి వద్దే ఉంటూ హాబీలతో కాలక్షేపం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఫొటోలను తీస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఫొటోలు తీయడమంటే ఆయనకు చాలా ఇష్టం.
Recent Post