ఓ నెటిజన్ కు ఫన్నీ రిప్లై ఇచ్చిన సోనూసూద్...

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 01:01 PM

లాక్‌డౌన్ సమయంలో నటుడు సోనూసూద్‌లోని కొత్త కోణం బయటపడింది. వెండితెర మీద విలన్ పాత్రలు పోషించిన సోనూ రియల్ హీరో అని దేశం మొత్తం గుర్తించింది. పలు సమస్యలపై దృష్టి సారించి తన వంతు సహాయం చేయడానికి సోనూ ముందుకొచ్చాడు. దీంతో కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను సోనూకు విన్నవించుకుని సహాయం అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఫన్నీ ట్వీట్లు కూడా చేస్తున్నారు. 


తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్.. దానికి సోనూ సూద్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. `సర్.. నాకు మాల్దీవులు వెళ్లాలని ఉంది. దయచేసి నాకు సహాయం చెయ్యండి` అని సోనూను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సోనూ.. `భయ్యా.. నీకు సైకిల్ కావాలా? రిక్షా కావాలా?` అని అడిగాడు. సోనూ ఫన్నీ రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
Recent Post