ఆ లోపు మీరు స్ట్రగులింగ్‌ డేస్‌ను ఎంజాయ్‌ చేయండి : పూరి జగన్నాథ్

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 01:07 PM

"అందరికీ సక్సెస్‌ వస్తుంది. కానీ ఆ లోపు మీరు స్ట్రగులింగ్‌ డేస్‌ను ఎంజాయ్‌ చేయండి" అని అంటున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన 'స్ట్రగులింగ్‌ డేస్‌' గురించి మాట్లాడుతూ "అబ్రహం లింకన్‌ చాలా పేద కుంటుంబంలో పుట్టాడు. డబ్బుల్లేక ఓ సంవత్సరం మాత్రమే స్కూలుకెళ్లాడు. అంబేద్కర్‌ ఇంకా పేద కుటుంబంలో పుట్టాడు. వీధి దీపాల కింద చదువుకున్నాడు. స్టీవ్‌ జాబ్స్‌తినడానికి తిండి లేక రోజూ నడుచుకుంటూ వెళ్లి హారే రామ హరే కృష్ణాలో తినేవాడు. మనందరికీ ఇలాంటి స్ట్రగులింగ్‌ డేస్‌ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు కన్నీళ్లు కూడా వస్తుంటాయి. మనకు ఎప్పుడు సక్సెస్‌ వస్తుందా? అని ఎదురుచూస్తుంటాం. ఏదో ఒకరోజు నువ్వు అనుకున్నది అయిపోతుంది చూడు. అప్పుడే కష్టాలు మొదలవుతాయి. సక్సెస్‌ తర్వాత అసలైన స్ట్రగులింగ్ డేస్‌ మొదలవుతాయి" అన్నారు. పూరీ మ్యూజింగ్స్‌ 'స్ట్రగులింగ్‌ డేస్‌' గురించి పూరీ చెప్పిన మరిన్ని విశేషాలు మీకోసం ...
Recent Post