సూపర్‌ హీరో ‘శక్తిమాన్’ ఏంటి ఇలా మాట్లాడారు..

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 01:19 PM

సూపర్‌ హీరో ‘శక్తిమాన్’ ముఖేష్‌ ఖన్నా సహానటులపై, సామాజిక విషయాలపై తరచూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన మీ టూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలను నెటిజన్‌లు, మహిళ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆయన మీ టూ ఉద్యమంపై మాట్లాడుతూ.. మీటూ ఉద్యమానికి మహిళలలే బాధ్యులు అని వ్యాఖ్యానించారు. ‘మహిళలు ఇంటి పనికి బాగా సరిపోతారు. అయితే మీ టూ ఉద్యమం ముదలైంది వారి వల్లే. ఎందుకంటే ఇంటి పని చేసుకోవడం మహిళ బాధ్యత. కానీ వారు అది చేయకుండా బయటకు వచ్చి పురుషులకు పోటీ పడటం(పురుషులతో భుజం-భజం కొట్టుకోవడం) ప్రారంభించారు. అందువల్లే మీ టూ ఉద్యమానికి తెరపడింది. దీనికి బాధ్యత వహించాల్సింది కూడా మహిళలలే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్‌లు ముఖేష్‌ కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Recent Post