రోజాతో రాజీ..ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 02:00 PM

టాలీవుడ్ లో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు ఆయనకు మధ్య వివాదం నడిచింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై టీవీ లైవ్ డిబేట్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నామన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా లేకుండా ఇద్దరూ బూతులతో తిట్టుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరికి మాటలు లేవు.
అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరు హాయిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు బండ్ల గణేష్. చాలాకాలం తర్వాత రోజా కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ఫోటోపై కొందరు నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. మెున్ననే తిట్టి ఇలా కలిసిపోతారేంటని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే నాడు ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి వీడియోను అప్ లోడ్ చేస్తున్నారు. మరికొందరైతే టీ షర్ట్ బాగుందని..ఇలాంటి కలయిక మంచిదేనంటూ సపోర్ట్ గా నిలుస్తున్నారు.
Recent Post