హంస చేసిన పాస్తా...

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 02:13 PM

అనుమానాస్పదం చిత్రం తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన హంస నందిని , ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్ద గా సక్సెస్ కాలేకపోవడం తో , అమ్మడికి హీరోయిన్ గా అవకశాలు రాలేదు..దీంతో ఐటెం సాంగ్స్ చేయడం మొదలు పెట్టింది. మిర్చి సినిమాలో మిర్చి మిర్చి అంటూ అందరిలో హాట్ నింపిన హంస నందిని..ఆ సినిమా తర్వాత అమ్మడికి వరుస ఐటెం సాంగ్ అవకాశాలు వచ్చాయి.


ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాతో మాత్రం అభిమానులు మరియు ఫాలోవర్స్ కు టచ్ లో ఉంటుంది. ఈమె ఎప్పుడు కూడా తన ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఆరు బయట కొండ ప్రాంతంలో పాస్తా రెడీ చేసిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. బ్యూటీఫుల్ హంసా నందిని ఒక మినీ ఫ్రాక్ వేసుకుని వావ్ అనిపించే స్కిన్ టోన్ తో చాలా హుషారుగా వంట చేసి ఆ వంటనే ఆస్వాదించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Recent Post