బిగ్ బాస్ 4: మోనాల్ తో సూటిగా చెప్పేసిన అభిజిత్

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 03:37 PM

బిగ్ బాస్ సీజన్ 4 లో నిన్నటి ఎపిసోడులో ఇంటి సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకొని... అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చుకుంటూ మరలా తిరిగి స్నేహితుల్లా కలిసిపోయే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. మొదటగా ఈ గేమ్ కోసం అఖిల్ అభిజిత్ కూర్చుని మాట్లాడుకుంటుండగా... వారి మనసులోని మాటలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా... వీరు చర్చించుకుంటున్న సమయంలో మోనాల్ గజ్జర్ కారణంగా తమ మధ్య నెలకొన్న విభేదాలకు మోనాల్ మూలకారణమని అర్థం చేసుకుని.... ఆ విషయాన్ని పక్కన పెట్టి తిరిగి స్నేహితులుగా మారే ప్రయత్నం చేశారు అభిజిత్, అఖిల్.
ఇంటిలో మన మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా.. నీవు నాకు ఫ్రెండ్ అంటూ అఖిల్ చెప్పడం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. తనకు అలాంటి ఫీలింగ్ ఉందని అభిజిత్ చెప్పడాన్ని బట్టి వారి మధ్య ఫ్రెండ్లీ వాతావరణం మళ్లీ కొనసాగుతుందని అర్థమయింది. ఇలా వీరిద్దరి చర్చ ముగిసి తిరిగి స్నేహితులైన సమయానికి.... తిరిగి తిరిగి మళ్లీ ఈ విషయం మోనాల్ వద్దకు వెళ్ళింది. వీరు ముగ్గురు కూర్చుని కలిసి మాట్లాడటం మొదలు పెట్టారు.
మోనాల్ వ్యవహరించిన తీరుపై విసుగు చెందిన అభిజిత్ కుండబద్దలు కొట్టినట్టు వారి ముఖంపైనే చెప్పాడు. మోనాల్ విషయంలో నా ఫీలింగ్ ఎప్పటికీ అదే. నా అభిప్రాయంలో ఎలాంటి మార్పు రాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పను.. చెప్పలేను అంటూ మోనాల్, అఖిల్‌కు అభిజిత్ స్పష్టం చేశాడు. దీంతో మోనాల్ బాగా ఫీల్ అయింది.... అయితే ఇప్పటివరకు చర్చ బాగానే కొనసాగినా స్నేహపూరిత వాతావరణం కనిపించినా.... అభిజిత్ మోనాల్ ను అలా అనడం చూసిన అఖిల్ తిరిగి అభిజిత్ తో స్నేహం చేస్తాడా లేక ఎప్పటిలాగే దూరం పెడతాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరి రేపు సండే, ఇది ఫండే ఏమి ఫన్ జరగనుందో వేచి చూడాలి.
Recent Post