'భీమ్ ఫర్ రామరాజు' టీజర్ కు రికార్డ్ వ్యూస్..

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 04:08 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై దేశం మొత్తం ఉన్న సినీప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. తారక్ గిరిజన వీరుడు కొమరం భీమ్ గా చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి రెండు టీజర్స్ విడుదల అయ్యాయి. ముందుగా రామ్ చరణ్ పుటిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో చరణ్ టీజర్ను విడుదల చేసాడు జక్కన. ఆ తర్వాత కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్ టీజర్ 'రామరాజు ఫర్ భీమ్' ను విడుదల చేసారు. అయితే రామ్ చరణ్ లుక్ ను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మార్చి 27వ తారీకున విడుదల చేసారు. తాజాగా రామ్ చరణ్ టీజర్ సరికొత్త రికార్డుని అందుకుంది. ఈ టీజర్ కి 33.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టాలీవుడ్ నుండి అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న టీజర్ గా ఇప్పటి వరకు సరిలేరు నీకెవ్వరు ఉండగా ఇప్పుడు నెం.1 స్థానంను భీమ్ ఫర్ రామరాజు దక్కించుకుంది. సరిలేరు టీజర్ 33.26 మిలియన్ ల వ్యూస్ ను రాబట్టగా.. భీమ్ ఫర్ రామరాజు ప్రస్తుతం 33.32 మిలియన్ ల వ్యూస్ ను కలిగి ఉంది. ఇక ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ వీడియోకు 26 మిలియన్ ల వ్యూస్ ఉన్నాయి. త్వరలో ఎన్టీఆర్ టీజర్ కూడా చరణ్ రికార్డ్ ను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Recent Post