అరుదైన ఘనత సాధించిన స్టార్ యాంకర్స్ ప్రదీప్, రష్మీ

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 31, 2020, 05:29 PM

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై యాంకర్ రష్మి గౌతమ్, ప్రదీప్ లు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఎన్నో బుల్లితెర షోలలో తమ వాక్చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ ఇద్దరు యాంకర్లు. అయితే ఇటీవలే యాంకర్లు ప్రదీప్ రష్మి గౌతమ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్ట్ కిరణ్ రాయి.. ప్రపంచంలోనే 400 మంది స్ఫూర్తి వంతుల జాబితాను ఇటీవలే విడుదల చేశారు. ఇక ఈ జాబితాలో ఆసియాలోని భారత్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లోని ప్రముఖుల పేర్లను ఎంపిక చేశారు.
ఇక ఈ పేర్లలో భారతదేశం నుంచి ఎంతోమంది ప్రముఖులు స్థానం సంపాదించగా.. ఈ జాబితాలో తెలుగు నుంచి రష్మి గౌతమ్, ప్రదీప్ మాచిరాజు ఉండడం గమనార్హం. ఇక ఈ జాబితాలో తమకు చోటు దక్కడం పై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు రష్మీ, ప్రదీప్. కాగా ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయులు వచ్చారు. ఇక టాలీవుడ్ నుంచి రష్మి, యాంకర్ ప్రదీప్ ఈ అరుదైన ఘనత సాధించడం తో.. ప్రస్తుతం అభిమానులు ఖుషీ అయిపోయారు.
Recent Post