కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ నటించనున్న 65వ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం వహిస్తారని ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ తదుపరి చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపించాయి. అయితే పారితోషికం విషయమై సమస్యలు తలెత్తడంతో ఆయన వెనక్కితగ్గారు. ప్రస్తుతం విజయ్ 65వ చిత్రాన్ని దర్శకత్వం చేయడానికి ప్రముఖ దర్శకులు పేరరసు, మగిళ్ తిరుమేని, నెల్సన్, మోహన్‌రాజా, హరి పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపించాయి. వీరిలో పేరరసుకు ఛాన్స్ లభిస్తుందని సినీ రంగ ప్రముఖులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విజయ్‌తో ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య సమావేశమై ఆయనకోసం సిద్ధం చేసిన కథను వినిపించారు. లవ్, సెంటిమెంట్, యాక్షన్ అంశాలు కలిగిన ఆ కథ విజయ్‌కి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ ఇదివరకే ఎస్జే సూర్య దర్శకత్వంలో ‘ఖుషీ’ చిత్రంలో నటించారు. ఆ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. మళ్ళీ ఎస్జే సూర్య, విజయ్ కాంబినేషన్లో చిత్రం వస్తే సక్సెస్ అవు తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరి విజయ్ అందుకు అంగీకరిస్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.