బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో మెహబూబ్‌కు అంతగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. తర్వాత తర్వాత నెమ్మదిగా పుంజుకున్న అతడు టాస్కుల్లో తన సత్తా చూపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆవేశంలో నోరు జారడం, రోబో టాస్కులో అతిగా ఆవేశపడటం, కోపంలో నోరు జారడం, కేవలం ఫిజికల్ టాస్కుల మీద మాత్రమే దృష్టి పెట్టడమే అతన్ని ఎలిమినేషన్ దిశగా నడిపించాయి. దీంతో పదోవారంలో ఇంటి సభ్యులను ఏడిపిస్తూ హౌస్ నుంచి భారంగా వీడ్కోలు తీసుకున్నాడు. బయటకు వచ్చాక అతడు అభిజిత్, సోహైల్‌కు తన పూర్తి మద్దతు తెలుపుతున్నాడు. దీంతో కొందరు నెటిజన్లు అఖిల్ నీ ఫ్రెండే కదా అతడికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మెహబూబ్ స్పందిస్తూ అతడు నామినేషన్‌లో లేడని, నామినేషన్‌లోకి వచ్చినప్పుడు అతడికి కూడా సపోర్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తన బిగ్‌బాస్ జర్నీ గురించి ప్రత్యేక వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాడు.
మెహబూబ్ తనపై జరిగిన ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. "బయట అప్పటికే నాకో ఫేమ్ ఉంది. అయితే అది టిక్‌టాక్ వల్లే వచ్చింది. అందుకే బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చింది అని చాలామంది అనుకున్నారు. అందుకే ట్రోల్ చేశారు. ఒక్కవారం కూడా ఉండనని అన్నవాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్లకు నేను ఎలా ఉంటానో తెలీదు. కాబట్టి అక్కడికి వెళ్లాక నన్ను చూసి వీళ్ల అభిప్రాయం మారుతుంది అనుకున్నా. అయినా సరే పది వారాల దాకా నామీద ట్రోలింగ్ ఆగలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయలేదు. నన్ను సపోర్ట్ చేస్తే వాళ్లను ఎక్కడ ట్రోల్ చేస్తారో అని! కేవలం నా కుటుంబం, ప్రేక్షకుల వల్లే ఇన్నివారాలు లోపల ఉన్నా. చివరికి నేను ఎలిమినేట్ అవుతుంటే, నేను లోపల ఉండాల్సిన వ్యక్తిని అని అంతా అంటున్నారు, అది సంతోషంగా ఉంది. మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా ట్రోల్ జరుగుతుంది అని తేలికగా తీసిపారేశారు. ఫిమేల్ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని చంపుతారు? అన్న ప్రశ్నకు దివితో పెళ్లి, హారికతో డేటింగ్, అరియానాను చంపేస్తానని మొహమాటం లేకుండా చెప్పాడు.