కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా రహస్యంగా రెండో పెళ్లిని చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ప్రభుదేవా తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా ప్రభుదేవా, బీహార్‌కు చెందిన పిజియోథెరపిస్ట్‌ను సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారట. ప్రభుదేవా దంపతులు ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారట. గతంలో వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ప్రభుదేవా ఫిజియో థెరపీ చికిత్స చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫిజియో థెరపిస్ట్‌తో ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వస్తున్న వార్తలపై ప్రభుదేవా సంబంధిత వర్గాలేవీ స్పందించలేదు.