ఈ రోజు ఉదయం తన కూతురు అర్హకు సర్ప్రైజ్ ఇచ్చానని హీరో అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ కూతురు అర్హ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు సందర్బంగా ఆమెను గుర్రంపై కూర్చోబెట్టాడు అల్లు అర్జున్. అంతేకాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెకు ఓ గిఫ్టును కూడా ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన ఆయన ఫొటోలను పోస్ట్ చేశాడు. అల్లు అర్హ నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. తన కూతురికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ తరుచూ పోస్ట్ చేస్తుంటాడు. అల వైకుంఠపురములో సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు.