నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. నాని 28వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కర్టెన్ రైజర్‌ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసి.. సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. నాని 28వ చిత్రానికి 'అంటే సుందరానికీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ కర్టెన్ రైజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హర్షవర్ధన్, సుహాస్ మధ్య ఏదో సీక్రెట్ డిస్కషన్ జరిగినట్లు చూపిస్తూ.. ఆసక్తికరంగా టైటిల్ 'అంటే సుందరానికీ' అని రివీల్ చేశారు. ఇందులో నాని లగేజ్ బ్యాగ్ పట్టుకుని అటు తిరిగి నిలుచున్నాడు. పల్లెటూరి వ్యక్తిగా పంచెకట్టుతో కనిపిస్తున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, 2021లో ఈ ఫన్ను ఎంజాయ్ చేయవచ్చునని ఈ కర్టెన్ రైజర్‌లో తెలిపారు. ఇంతకు ముందు తన సినిమాలో చూడని లవ్, నవ్వులను ఈ సినిమాలో చూస్తారంటూ నాని ట్వీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.