ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా ఫ్యామిలీ కోసం తమిళ్ డైరెక్టర్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 21, 2020, 04:29 PM



హీరో రామ్‌చరణ్‌తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్న దర్శకుడు మోహన్‌రాజాకు చిరంజీవి కొత్త బాధ్యతల్ని అప్పజెప్పారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. చిరుతో 'లూసిఫర్‌' రీమేక్‌ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఈయనకే లభించినట్టు సమాచారం. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్‌' రీమేక్‌ హక్కుల్ని చరణ్ ఇప్పటికే సొంతం చేసుకున్నారు. ఆ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సుజీత్‌, వి.వి.వినాయక్‌ తదితర పేర్లు పరిశీలించినా సరే ఏదీ కుదరలేదు. ఇప్పుడు ఆ బాధ్యతను మోహన్‌రాజా తీసుకున్నారట.
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలు చేశారు మోహన్‌. రామ్‌చరణ్‌కు విజయాన్ని అందించిన 'ధృవ' మాతృక 'తని ఒరువన్‌' తీసింది ఈయనే. తన కథలో చక్కగా ఒదిగిపోయిన రామ్‌చరణ్‌తో నేరుగా ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలో 'లూసిఫర్‌' రీమేక్‌ అవకాశం ఆయన్ని వరించినట్టు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక 'లూసిఫర్‌' రీమేక్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత చరణ్‌ - మోహన్‌రాజా కలయికలో సినిమా రూపొందే అవకాశాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com