అర్హకు పార్టీ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 22, 2020, 12:15 PM

నిన్న సినీనటుడు అల్లు అర్జున్ కూతురు అర్హ తన పుట్టినరోజు వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను గుర్రంపై కూర్చోబెట్టి ఆహెకు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ ఇవ్వడమేకాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెకు ఓ గిఫ్టును కూడా  ఇచ్చాడు. మరోవైపు, మైత్రీ మూవీ మేకర్స్ అర్హ పుట్టినరోజు వేడుకను జరిపారు. ఆమెతో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫొటోలను అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు.


అర్హ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును గుర్తుండిపోయేలా చేసిన మైత్రీ మూవీ మేకర్స్ రవిగారు, నవీన్ గారు, చెర్రీగారితో పాటు ఇతర సభ్యులందరికీ   వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెబుతున్నానంటూ అర్లు అర్జున్ పేర్కొన్నాడు. మధుర జ్ఞాపకాలను అందించారని చెప్పాడు.


కాగా, నిన్నటితో అల్లు అర్హ నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. తన కూతురికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ తరుచూ పోస్ట్ చేస్తాడన్న విషయం తెలిసిందే. 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు.
Recent Post