నాని డబుల్ ధమాకా...?

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 22, 2020, 03:36 PM

నేచురల్‌ స్టార్‌ నాని, తదుపరి చేయబోయే 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రంలో.. ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, ఇప్పుడు పవన్‌ 'టక్‌ జగదీష్‌' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'శ్యామ్‌సింగరాయ్‌' షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్‌ తీసుకోవాలని నాని అనుకోవడం లేదట. ఎందుకంటే ఒకవైపు లాక్‌డౌన్‌ వల్ల గ్యాప్‌ను పూర్తి చేయాలనేది నాని ఆలోచనగా కనిపిస్తుంటే..మరోవైపు డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ వెయిటింగ్‌లో ఉన్నాడు.  ఇవి కాకుండా మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు నాని. కాగా 'శ్యామ్‌సింగరాయ్‌' సినిమాలో మన నేచురల్‌ స్టార్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఓ పాత్ర 1960లో కనిపిస్తే, మరో పాత్ర ప్రెజెంట్‌ జనరేషన్‌లో కనిపిస్తుందట. కోల్‌కత్తా, హైదరాబాద్‌లలో సాగే పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Recent Post