ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ 4: లాస్య ఎలిమినేటెడ్‌.. హౌజ్‌లో ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 23, 2020, 11:55 AM



తెలుగు బిగ్‌ బాస్‌ నుండి మరొకరు ఎలిమినేట్‌ అయ్యారు. వారాలు గడుస్తున్న కొద్ది స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. టాప్‌ 5 లో ఉంటుందని బలంగా నమ్మిన అభిమానులు నిరాశ పడేలా లాస్య బయటకు వచ్చేసింది. ఖచ్చితంగా విన్నింగ్‌ కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్ అంటూ లాస్య గురించి చాలా బలంగా అంతా నమ్మారు. కాని ఆమె అనూహ్యంగా ఎలిమినేట్‌ అవ్వడం అభిమానులకు షాకింగ్‌ గా అనిపించింది. ఎలిమినేషన్‌ విషయం శనివారం లీక్‌ అయినా కూడా ఆమె అభిమానులు చాలా మంది లాస్య వెళ్లక పోవచ్చు అంటూ బలంగా అనుకున్నారు.
లాస్య ఎలిమినేషన్‌ కు సంబంధించి ఆ తంతు కూడా పూర్తి అయిన తర్వాత అప్పుడు అంతా కూడా అయ్యో అటూ ఎమోషనల్‌ అయ్యారు. ఇక 78వ ఎపిసోడ్‌ సండే అవ్వడంతో ఎప్పటిలాగే ఫన్‌ డే లా సాగింది. బొమ్మలను చూపించి పాటలను గెస్‌ చేయమన్నారు. ఆ గేమ్‌ లో హారిక లీడర్‌ గా వ్యవహరించిన టీం గెలుపొందింది. ఆ తర్వాత లూడో ఆడారు. ఆ గేమ్‌ కూడా చాలా సరదాగా ఫన్నీ టాస్క్‌ లు చేస్తూ నవ్వించారు. లూడో గేమ్‌ లో ఈసారి అరియానా గెలిచింది. మద్య మద్యలో సేవ్‌ చేస్తూ వచ్చాడు. అభిజిత్‌, మోనాల్‌ మరియు హారికలు సేవ్‌ అవ్వగా చివర్లో అరియానా మరియు లాస్యలు మిగిలారు.
వీరిద్దరిలో అరియానా ఎలిమినేట్ అనుకున్నారు. కాని అనూహ్యంగా లాస్య ఎలిమినేట్‌ అంటూ నాగార్జున ప్రకటించాడు. ఎక్కువ మంది లాస్య సేఫ్‌ గేమ్ ఆడుతుంది అంటూ చెప్పడం వల్లే ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె సేఫ్‌ గేమ్‌ ఆడినా కూడా ఓట్లు అయితే పడ్డాయి. కాని ఆమె వల్ల బిగ్‌ బాస్ కు కంటెంట్‌ రావడం లేదు. ఆ కారణంగానే ఆమెను సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు అంటూ బయటకు పంపించారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లాస్య ఎలిమినేషన్‌ తో ఇంటి సభ్యులు అంతా ఎమోషన్‌ అయ్యారు. అయితే లబో దిబో అంటూ కన్నీరు అయితే పెట్టుకోలేదు. హుందాగా ఎమోషనల్‌ గా లాస్యను బయటకు పంపించారు.
ఇక ఎలిమినేషన్‌ పూర్తి అయిన తర్వాత లాస్య నాగార్జున వద్దకు వచ్చింది. స్టేజ్‌ పై నుండి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడింది. టాప్‌ 2 ఎవరు అంటే తడుముకోకుండా బయట ఏదైతే ప్రచారం జరుగుతోందో అదే చెప్పింది. అభిజిత్‌ మరియు సోహెల్‌ లు టాప్ 2 లో ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. లాస్య తనకు ఇంటి మొత్తంలో అభిజిత్‌ అంటే చాలా ఇష్టం అంది. ఇక హారిక తో ఎక్కువ గడపడం ఇష్టంగా చెప్పింది. వెళ్లి పోయే ముందు ఎవరిని నొప్పించకుండా సింపుల్‌ గా చెప్పేసింది. మోనాల్‌ గత రెండు మూడు వారాలుగా బాగా ఆడుతుందని లాస్య అభిప్రాయం వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com