బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. వారం, వారం కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతోన్న నేపథ్యంలో..వీక్షకుల చేత టాప్ అనిపించుకుంటున్న వాళ్లు ఇంట్లో టైటిల్ రేసులో నిలబడుతున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు…? ఈ విషయంలో ఒక్కొ కంటెస్టెంట్ ఫ్యామిలీది ఒక్కొ ఎనాలిసిస్.. కానీ అందరూ కలిసి యూనానిమస్‌గా సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ కూడా ఒకరున్నారు. అతనే ఇస్మార్ట్ సోహైల్.. కథ వేరుంటది అని బిగ్ బాస్ హౌస్‌లో హల్ చల్ చేసిన ఈ సింగరేణి ముద్దుబిడ్డ.. ఇప్పుడు అందరికీ హాట్ ఫేవరేట్ అయ్యారు.
బిగ్ బాస్ హౌస్‌లో ఈక్వేషన్స్ రోజు రోజుకు మారిపోతున్నాయి. లాస్ట్ మండే హీటెడ్ డిస్కషన్‌తో హౌస్మేట్స్ మధ్య దూరం పెంచారు బిగ్ బాస్. ఇక ఈ వారం అంతా హౌస్ వార్ జోన్లా ఉంటుందనుకుంటే.. సడన్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకొచ్చిన కూల్ చేశారు. అంతే మసాల మిస్ అని ఫీల్ అయ్యారు ఆడియన్స్.. కానీ అలా వదిలేస్తే అది బిగ్ బాస్ హౌస్ ఎలా అవుతుంది చెప్పండి. అందుకే వీకెండ్లో నాగ్‌తోనే చిచ్చు పెట్టించారు బిగ్ బాస్.
పాత గాయాలను మళ్లీ రేపుతూ కొత్త గొడవ మొదలు పెట్టారు బిగ్ బాస్. అంతేకాదు స్టేజ్ మీదకు ఫ్యామిలీ మెంబర్స్‌ను పిలిపించి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్పించారు. ఈ విషయంలో ఒక్కొక్కళ్లది…. ఒక్కో థియరీ.. బట్ అందరికీ నచ్చిన కంటెస్టెంట్ మాత్రం సోహెలే.. యస్… అందిరి ఫ్యామిలీ మెంబర్స్ సోహోల్ టాప్ 5లో ఉంటాడని గట్టిగా చెబుతున్నారు. మరి నిజంగానే సోహెల్ టాప్ 5లో నిలబడతాడా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.