తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా రన్ అవుతూ మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా లాస్య ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం అభిజిత్, సోహైల్, హారిక, మోనాల్, అరియానా, లాస్య నామినేషన్లో ఉండగా.. వీరిలో మోనాల్ పక్కాగా ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ శుక్రవారం నాటి ఎపిసోడ్లో మోనాల్ అఖిల్‌ను కాదని హారికకు సపోర్ట్ చేసింది. తనపై నమ్మకం ఉంచినందుకు దేత్తడి హారికను కెప్టెన్ చేసింది.
అఖిల్‌ను ఎత్తుకుని సోహైల్, అభిజిత్‌ను ఎత్తుకుని అవినాష్ ఎక్కువ సేపు నిలబడలేకపోగా మోనాల్ మాత్రం ధైర్యంగా హారికను భుజాన మోసి చివరివరకు నిలబడింది. ఏడు సార్లు కెప్టెన్సీకి పోటీ చేసి ఓడిన హారికకు ఏట్టకేలకు విజయాన్ని సొంతం చేసింది మోనాల్. దీంతో మోనాల్ బలమేంటో అందరికీ తెలిసొచ్చింది. తలుచుకుంటే తనూ ఆడగలదని నిరూపించింది. ఈ ఒక్క ఎపిసోడ్ కారణంగా ఆమె ఎక్కువ ఓట్లు పడ్డాయట. దీంతో ఆఖరి నిమిషంలో లాస్యను కిందకు లాగి ఆమె పై స్థానానికి వెళ్లిపోయింది. అలా ఈవారం ఎలిమినేషన్ నుంచి మోనాల్ తప్పించుకోగలిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్'ను చూస్తే.. బిగ్ బాస్ టీవీలో ఇచ్చే కొన్ని గుర్తుల, బొమ్మలు ఆధారంగా అది ఏ పాటో గుర్తుపట్టాలని టాస్క్ ఇచ్చాడు నాగార్జున. దీని కోసం ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టారు. హారిక కెప్టెన్‌గా ఒక టీమ్, అరియానా కెప్టెన్‌గా మరో టీమ్‌గా విడదీశారు. హారిక టీమ్‌లో లాస్య, అభిజీత్, అఖిల్ ఉండగా అరియానా టీమ్‌లో అవినాష్, సోహెల్, మోనాల్ ఉన్నారు. మొత్తంగా పాటల పోటీ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. పాటల గేమ్ తరవాత లూడో గేమ్ ఆడించాడు నాగార్జున. ఇక్కడ కూడా హారిక, అరియానా టీమ్‌ల మధ్య ఈ పోటీ జరిగింది. ఈ గేమ్‌లో అరియానా టీమ్ విజయం సాధించింది. ఇక చివరగా ఎలిమినేషన్లో హారిక లాస్య ఇద్దరు మిగలగా.. అందరు అనుకున్నట్లే లాస్య ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు నాగార్జున.
అది అలా ఉంటే తాజాగా లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అవినాష్'ను టార్గెట్ చేస్తూ.. అరియానా ఆ పొట్టేంటీ అంటూ అంకుల్‌లాగా ఉన్నావని కామెంట్ చేసింది. అంతేకాదు నీ కంటే నీ పొట్ట ముందు నడుస్తుందని తీవ్ర కామంట్ చేసింది. ఇక మిగిలిన సభ్యలు అఖిల్, సోహైల్ లు అవినాష్‌ను ఆటపట్టించారు. సోహైల్ మాత్రం అవినాష్‌ను ఉద్దేశిస్తూ.. మావోనికి ముగ్గురు పిల్లలున్నరు, కూకట్ పల్లి, మణికొండలో రెండు ఫ్యామిలీలు ఉన్నాయంటూ పరువుతీశాడు. దీంతో అవినాష్ నేనేం పాపం చేశానంటూ ఏడ్వడం మొదలుపెట్టాడు. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండనుందో..