ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లవ్‌స్టోరీ' నుండి నాగ చైతన్య బర్త్ డే పోస్టర్ విడుదల..

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 23, 2020, 04:52 PM



అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ చిత్రాన్ని ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు నాలుగు నెలల పాటు తాత్కాలికంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తయింది. తాజాగా నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ రిలీజ్ చేసి. స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ఈ కొత్త పోస్టర్లో నాగ చైతన్య బనీన్‌, లూంగీతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఇటీవలే ఈ సినిమా నుంచి సాయిపల్లవి, నాగచైతన్య పెళ్లి పీటలపై ఉన్ పోస్టర్‌ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com