బాత్‌టబ్‌లో బికినీతో రెచ్చిపోయిన సమంత..!

  Written by : Suryaa Desk Updated: Wed, Nov 25, 2020, 01:14 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత నెల రోజుల నుండీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా బుల్లితెర మరియు ఓటిటి ల వేదికగా.. అభిమానులను అలరిస్తుంది సమంత. దసరా రోజున ‘బిగ్ బాస్4’ స్పెషల్ ఎపిసోడ్ ను హోస్ట్ చేసి ఔరా అనిపించింది. ఒక్క షో కూడా చూడకుండా.. అందులోనూ తెలుగు సరిగ్గా చదవడం మాట్లాడటం రాకుండా.. ఆ షోని హోస్ట్ చెయ్యడం అంటే మాటలు కాదు. ఇక అటు తరువాత ‘ఆహా’ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షోను కూడా హోస్ట్ చేస్తూ వస్తోంది.
ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లను చిత్రీకరించారని సమాచారం. అయితే కొంచెం గ్యాప్ దొరికింది అనుకుంట.. తన భర్తతో కలిసి మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఓ చిన్న పిల్ల మాదిరి సమంత ఎంజాయ్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే కాజల్, రకుల్ ప్రీత్, ప్రణీత వంటి వారు.. మాల్దీవుల్లో సందడి చేశారు. కాజల్, రకుల్ వంటి వారు అయితే విల్లులా వంగి భంగిమలు కూడా చేశారు.అక్కడితో ఆగలేదు బికినీల్లో ఫోజులు కూడా ఇచ్చి అభిమానులను ఆకర్షించారు.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా..! ఇప్పడు సమంత కూడా నేనేమి తక్కువ కాదు అన్నట్టు కొత్త ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఈ క్రమంలో బాత్ టబ్ లో సమంత ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫొటోలో సమంత తన యద అందాలను ప్రదర్శిస్తూ.. రొమాంటిక్ గా స్మైల్ ఇస్తుండడం విశేషం. పెళ్ళైన తరువాత కూడా సామ్ నుండీ ఇలాంటి ఫోటో బయటకి రావడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.
Recent Post