బిగ్ బాస్ 4: హౌస్ లో దెయ్యం.. గజ గజ వణికిన అరియానా!

  Written by : Suryaa Desk Updated: Wed, Nov 25, 2020, 01:52 PM

బిగ్ బాస్ హౌస్ లో మరోసారి దెయ్యం హల్ చల్ చేసింది. సీజన్ 1 లో దెయ్యాలు వచ్చాయని చెప్తూ ఒక టాస్క్ గా దీన్ని చిత్రీకరించాడు బిగ్ బాస్. అప్పుడు కిచెన్ లో డిష్ వాష్ చేస్తున్న అర్చన అద్దంలో దెయ్యాన్ని చూసి ఒక్కసారిగా వణికిపోయింది. మిగతా హౌస్ మేట్స్ కి చెప్తూ ఖంగారు పడిపోయింది. ఆ తర్వాత మిగితా రెండు సీజన్స్ లో కూడా ఇలాంటి టాస్క్ ని పెట్టలేదు బిగ్ బాస్. మళ్లీ ఇప్పుడు సీజన్ 4 దెయ్యాల టాస్క్ ని రూపొందించారు. ఇందులో భాగంగానే అరియానాకి అద్దంలో కనపడిన దెయ్యాన్ని చూసి గజ గజ వణికిపోయింది.
హౌస్ లో ప్రస్తుతం 7మంది మాత్రమే ఇంటి సభ్యులు ఉన్నారు కాబట్టి ఇళ్లంతా ఖాళీగా సందడి లేకుండా ఉంది. అంతేకాదు, ఎవరి పని వాళ్లు చేసుకుంటూ మూభావంగానే ఉంటున్నారు. ఇలాంటి టైమ్ లో అద్దంలో దెయ్యాన్ని చూసిన అరియానాకి షాక్ తగిలింది. ఎందుకంటే, ఇలాంటి టాస్క్ ఉంటుందని అరియానా అస్సలు ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా భయపడి మిగతా హౌస్ మేట్స్ ని పట్టుకుని ఏడ్చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఆత్మలు ప్రవేశించాయని, వాటిని పోగొట్టాలంటే టాస్క్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పిన తర్వాత కానీ ఆ ఆత్మలు వెళ్లవు. మరి ఇది టాస్క్ అని తెలిసి అరియానా ఎలా ఫీల్ అవుతుందనేది ఆసక్తికరం. ఇక అప్పట్లో అర్చన, ఇప్పడు అరియానా అంటూ రెండు ఫోటోస్ ని పోలుస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్లు చేస్తున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. అదీ మేటర్.
Recent Post