పవన్ పాన్ ఇండియా మూవీలో ఆ బ్యూటీ పాత్ర చాలా కీలకం అట..?

  Written by : Suryaa Desk Updated: Wed, Nov 25, 2020, 02:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'వకీల్ సాబ్' షూటింగులో పాల్గొంటున్న పవర్ స్టార్ క్రిష్‌తో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నట్లు టాక్. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు నటించడానికి స్కోప్ ఉండటంతో మొదటి హీరోయిన్‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఆమె కన్ఫార్మ్ చేసింది.మరో హీరోయిన్‌ కోసం యూనిట్‌ ఇస్మార్ట్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని తీసుకోబోతున్నట్లు ప్రచారం బయటికి వచ్చింది.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సౌత్ ఇండియా సెన్సేషన్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో తీసుకోబోతున్నట్లు దాదాపు కన్ఫామ్ అయినట్లు చిత్ర బృందం నుంచి సమాచారం అందుతుంది.. ఇక ఈ సినిమాలో జమీందారీ కుటుంబానికి చెందిన యువతి పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. అందువల్ల ఈ పాత్రకి సాయిపల్లవి అయితే చాలా బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ సినిమాలో ఈ పాత్ర పోషించడానికి సాయిపల్లవి ఓకే చెప్పేసిందంటూ సోషల్‌మీడియా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.ఇక ఈ సినిమా తరువాత పవర్ స్టార్ మలయాళం సినిమా"అయ్యప్పనం కోషియం " రీమేక్ లోను అలాగే సురేందర్ రెడ్డీ తో ఓ సినిమా అలాగే తనకు గబ్బర్ సింగ్ లాంటి కం బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడని సమాచారం.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి.
Recent Post